Wednesday 19th of June 2013






news menu leftnews menu right
ACB Director General Prasad Interview by ABN

ACB Director General Prasad Interview by ABN

 

 
మన పతనానికి బాటలు

 

వాస్తవం:

"ఏమి చేసైనా సరే అధికారం లొకి రావడమే రాజకీయం"

"అక్రమార్జన లేకుంటే అది రాజకీయమే కాదు"

"అందరూ దొంగలే కదా, మరి మా నాయకుడు దొంగ అయితే తప్పు ఏమిటీ ?"

"వాడు నిజమైన రాజకీయ నాయకుడు, కనుకనే హత్యలు చేసాడు, ప్రజా ధనాన్ని దోచుకున్నాడు,  భూ కబ్జాలు చేసాడు. అవి చేయ కుంటే అసమర్ధుడు అంటారు"

ఈ రోజుల్లో చాలా మంది చాలా సాధారణంగా వ్యక్త పరుస్తున్న భావాలు ఇవి. వారు విధ్యాధికులా, విధ్యాధములా అన్న తేడాలేకుండా రాజాకీయానికి వారికి అనుకూలమైన కొత్త నిర్వచనాన్ని మన తరువాత తరాలకు అందిస్తున్నారు.

 

Read more...
 
నైతిక విలువల్లేని కులం, మతం వ్యర్ధం !!

వాస్తవం : ప్రపంచంలో ఏ మతానిదైనా ధ్యెయం ఒక్కటే, అది ప్రతి మనిషిని ధర్మ మార్గం లో నడిపించడమే.

అన్ని మతాల తత్వం ఒక్కటే, అది శాంతి తత్వం. 

ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, కాని వారికి తాము అనుసరిస్తున్న మతం పట్ల విశ్వాసం, చిత్తశుద్ది ఉన్నవా లేవా అనేది అతి ముఖ్య మైనది. అవి ఉన్నవారు తమ మతాన్ని గౌరవిస్తూ, మతం నుండి నేర్చుకున్న ధర్మాన్ని పాటిస్తూ నైతిక విలువలతో సమాజం లో, కుట్ర లేని, దగా లేని వున్నత పౌరులుగా జీవించ గలుగుతారు. వారు నిజమైన నాయకులవుతారు దేశానికి ఉత్తమ పాలకులు కాగలుగుతారు.   

తన మతం మీద ఏమాత్రం గౌరవం లేకుండా, నైతిక విలువలకు స్వస్తి చెప్పి అన్ని మతాల వారిని, కులాల వారిని మోసం చేస్తూ బ్రతికే వారు సమాజం లో చీడ పురుగులు గా, కలి కాలపు రాక్షసులుగా మిగులుతారు. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పడతూ, ఏమారి వున్న ప్రజల్ని నిలువునా మోసగిస్తారు.

మతం పేరుతో, కులం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలను నడిపే వారంతా ఈ చీడపురుగుల కోవ లోకే వస్తారు. గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంధాల విలువ కూడ తెలియని వారు, ఆ గ్రంధాలను యెరగా చూపి ఓట్లు అడిగితే అది నీచత్వమే అవుతుంది. ఇలాంటి నీచులు కొందరు దేశంలో రాజాకీయాన్ని, అధికారాన్ని, పెద్దరికాన్ని చెలాయిస్తూ, ప్రజల్లో కుల మత  తత్వాలను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపు కొంటారు, సభ్య సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. 

ఉదాహరణకు ఇతర మతం లోకి మారి అటు ఆ మతాన్ని తమ స్వార్ధానికి, ధన దాహానికి, ఓట్ల కోసం వాడుకుంటూ....., తమ పేర్ల చివర ఉన్న హిందూ కుల పేర్లైన నాయుడు, రెడ్డి, చౌదరి లను కొనసాగిస్తూ... ఇటు హిందువులనూ ఓట్ల కోసం మోసం చెస్తున్న వారు పరమ నీచులు కాక ఎమవుతారు ?            

Read more...
 
దీపావళి శుభాకాంక్షలు

 
Rahul Gandhi real intention about India

ARVIND KEJRIWAL ON RAHUL GANDHI REAL INTENTION ABOUT INDIA

">

 


tinnitus miracle

All rights on the content on this website are reserved toVastavam.net.