Friday, 24 March 2017 | Login

అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్‌ఖాన్‌ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్‌ఖాన్‌ వీడ్కోలు

వాస్తవం ప్రతినిధి:  అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్‌ఖాన్‌ గురువారం వీడ్కోలు పలికాడు. జహీర్‌ఖాన్‌ తన కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 92 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 11 సార్లు 5వికెట్లు,

ఒకసారి 10 వికెట్లు సాధించాడు. 200 వన్డేల్లో 282 వికెట్లు, 17 టీ20 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. గాయాల వల్ల గత నాలుగేళ్లుగా తరచూ జట్టులోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. 2011 ప్రపంచకప్‌ విజయంలో జహీర్‌ కీలక పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్‌ టోర్నీలో జహీర్‌ఖాన్‌ 21 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరుపున ఆడుతున్నాడు. టెస్టులో కుంబ్లే, కపిల్‌, హర్భజన్‌ తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా జహీర్‌ఖాన్‌ గుర్తింపు పొందాడు.

Read 145964 times Last modified on Monday, 02 November 2015 00:24
Rate this item
(1 Vote)

About Author

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock