Sunday, 20 August 2017 | Login

సీ ఎం కు ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఓ ఎస్ డి నా ? : రఘువీరారెడ్డి

సీ ఎం కు ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఓ ఎస్ డి నా ? : రఘువీరారెడ్డి

వాస్తవం ప్రతినిధి :ఎపి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలాంటి అనుభవంలేని వ్యక్తిని ఓ ఎస్ డిగా ఎలా నియమించారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు..

. నారా లోకేష్ కు స్నేహితుడైన సీతపల్లి అబీష్ట ను అందలం ఎక్కించడం పై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది... అభీష్ట నియామకం అనధికారికంగా జరిగిందని సమచారహక్కు చట్టం ద్వారా సేకరించిన కాంగ్రెస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.రఘువీరా కామెంట్సు కు స్పందించిన ప్రభుత్వం అబీష్ట నియామకం అదికారికమని దృవీకరించింది. సిఎం కార్యాలయంలో ప్రతి ఫైల్ అబీష్ట గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదులుతుందన్న విషయం కొందరికి మింగుడు పడటంలేదు.. సీనియర్ ఐఎఎస్ అధికారులు సైతం అబీష్టతో చర్చించాల్సి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2015 లో అబీష్ట నియామంక జరగలేదన్న సమాచారచట్టం క్రింద జవాబు ఇచ్చిన  జిఎడి శాఖ 2014 లోనే నియామకం జరిగినట్లు తాజా గా దృవీకరించడం కొసమెరుపు.. రెండింటిలో ఏది నిజమని రఘువీరా ప్రశ్నించారు. అబీష్ట గతంలో ఓ చానల్ కు కొద్ది రోజులు నామమాత్రపు సిఇఓ గా పనిచేసారు. కేవలం చినబాబు కు స్నేహితుడు కావడం వలనే అందలం ఎక్కించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Read 68656 times Last modified on Sunday, 01 November 2015 21:29
Rate this item
(0 votes)

About Author

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock