Saturday, 29 April 2017 | Login

అట్లాంట ఆప్త వన భోజనాలు

అట్లాంట ఆప్త వన భోజనాలు

వాస్తవం ప్రతినిధి: అట్లాంట ఆప్త వన భోజనాలు ఆదివారం సెంటర్ పార్క్ రిక్రియేషన్ సెంటర్లో ఘనంగా జరుపుకొన్నారు. దీనికి ముఖ్య అతిధిగా ఆప్త సభ్యులు  శ్రీ కిరణ్ పల్లా గారు విచ్చేసి పిల్లల భవిష్యత్ ప్రణాళికలు , మేధస్సు పెంచుకోవడం

మరియు వారిని రాబోయే తరాలలో రత్నాలు గా తీర్చి దిద్దడం ఎలా అనే వాటిపై చక్కటి అవగాహన ఆప్తులకు కల్పించారు.  మధ్యాహ్నం వివిద రకముల వంటకాలతో మొదలైన వన బోజనాలు , పిల్లలు దేశభక్తి గీతం - దేశమును ప్రేమించుమన్న అని రాగ యుక్తం తో పాడి ఆహుతులను అలరించారు. తరువాత స్క్రాంబుల్ ఆటతో ఒకరికి ఒకరు పరిచయాలు, శ్రీ కిరణ్ గారి చక్కని వాక్యణాలు, పిల్లల ఆకంక్షలు, పెద్దలు ఆప్యాయతతో కూడిన సంభాషణల తో  చివరిగా పిల్లలు ఆట పాటలతో ఆద్యంతం ఎంతో ఉల్లాసం గా  జరిగింది. అట్లంటా కార్యనిర్వాహక వర్గం యెల్లబండి రాజేష్, రామకృష్ణ వేల్పూరి, రామ బండిరెడ్డి, సాంబశివరావు బేతంచెర్ల, సురేష్ ధూళిపూడి, సురేష్ కరౌతూ మొదలైన వారు చివరిగా ఈ ఈవెంట్  ఘనంగా జరగడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలుతెలుపుకొన్నారు.

Read 345175 times Last modified on Sunday, 01 November 2015 20:46
Rate this item
(0 votes)

About Author

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock